Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంట్రుక వాసిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న వైనం.. వీడియో ఇదిగో!

  • అమెరికాలోని టెక్సాస్‌లో ఘ‌ట‌న‌
  • వ‌ణికిస్తోన్న మంచు తుపాను
  • రోడ్ల‌పైకి రావ‌ద్దంటోన్న పోలీసులు
ఓ పోలీస్ అధికారి వెంట్రుక వాసిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అమెరికాను మంచు తుపాను వ‌ణికిస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో రోడ్ల‌న్నీ ప్ర‌మాద‌క‌రంగా మారాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే ర‌హ‌దారుల‌పైకి రావాల‌ని అక్క‌డి పోలీసులు సూచిస్తున్నారు.

 తాజాగా అక్క‌డి రోడ్డుపై ఓ పోలీస్ ఆఫీస‌ర్‌ న‌డుచుకుంటూ వెళుతూ జారిప‌డ్డాడు. అదే స‌మ‌యంలో ఓ కారు వేగంగా ప‌య‌నిస్తూ ఆయ‌న ప‌క్క నుంచే వెళ్లింది. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ఆయ‌న ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్క‌డి పోలీసులు త‌మ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయ‌గా ఇది వైర‌ల్ అవుతోంది.. మీరూ చూడండి.. 
america
texas
car accident

More Telugu News